
వెలుగు, హైదరాబాద్ సిటీ : గ్రేటర్ వ్యాప్తంగా రూ.149.84 కోట్లతో 224 బ్యూటిఫికేషన్ పనులు చేపట్టినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం ఆమె నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలోని ఫ్లైఓవర్కింద రూ. 87.60 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ఫౌంటేన్, కలర్‌ఫుల్ లైటింగ్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ ఇమేజ్ ను పెంచేలా సిటీలోని జంక్షన్ల అభివృద్ధి జరుగుతోందన్నారు. హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి, జోనల్ కమిషనర్ రవికిరణ్, డీసీ మారుతి దివాకర్, ఎస్ఈ రత్నాకర్, విద్యుత్ ఈఈ సంతోశ్పాల్గొన్నారు.